విశాఖపట్నంలో అక్టోబర్ నెలలో నమోదైన 83 చోరీ కేసుల్లో 58 కేసులను ఛేదించి, 77 మందిని అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ శంకబ్రత భాగ్చి తెలిపారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, రికవరీ మేళాలో భాగంగా రూ. కోటి 12 లక్షల విలువైన సొత్తును బాధితులకు అందజేశారు. ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్రిప్టో కరెన్సీ మోసాలపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.