పాడుబడిన బావిలో మృతదేహం కలకలం

8చూసినవారు
పాడుబడిన బావిలో మృతదేహం కలకలం
విశాఖపట్నంలోని మల్కాపురం పరిధి జయేంద్ర కాలనీలో ఒక పాడుబడిన బావిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, దానిని బయటకు తీయడం కష్టతరంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినది ఒక పురుషుడని భావిస్తున్నారు. పోలీసులు మృతుని వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్