గాజువాకలోని అగనంపూడి నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డొంకాడ కాలనీకి చెందిన గుర్రం రాము (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంగా వచ్చిన వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.