కేజీహెచ్ లోప్రమాదం.. అందరూ సెఫ్

1388చూసినవారు
కేజీహెచ్ కార్డియాలజీ వార్డులో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు మొదలయ్యాయని ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ బంగారయ్య తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రోగులందరినీ ఇతర వార్డులకు తరలించి అపాయాన్ని నివారించారు. సమాచారం వెంటనే అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వరప్రసాద్ చెప్పారు.