గౌతమ బుద్ధుని జయంతిని పురస్కరించుకుని మే 1వ తేదీ శుక్రవారం నాడు విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అన్ని రకాల మాంసం, చేపల దుకాణాలకు సెలవు ప్రకటించారు. బుద్ధ జయంతి సందర్భంగా నగరంలోని మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయశాలలతో పాటు జంతు వధశాలలన్నింటినీ తప్పనిసరిగా మూసివేయాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ. ఎన్. వి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా విక్రయాలు సాగించినా లేదా వధశాలలు తెరిచినా వారిపై జీవీఎంసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.