విశాఖలో బైక్ పెట్రోల్ దొంగలు: సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు

1178చూసినవారు
విశాఖపట్నంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ దొంగిలించే ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 89వ వార్డు పరిధిలోని కారవేలానగర్ ప్రాంతంలో గత పది రోజులుగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో బైకుల ట్యాంకుల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్