విశాఖ స్టీల్ ప్లాంట్ తాత్కాలిక సీఎండీ, కేంద్ర ప్రభుత్వం కమీషన్ల కోసం నాసిరకం కోక్ కొనుగోలు చేస్తూ ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెడుతున్నారని సీఐటీయూ నేతలు సి. హెచ్. నరసింగరావు, ఎం. జగ్గునాయుడు సోమవారం విశాఖలో ఆరోపించారు. నాసిరకం కోక్ వాడకం వల్ల నాణ్యతలేని స్టీల్ ఉత్పత్తి అవుతోందని, కొనుగోలుదారులు దానిని తిరస్కరిస్తున్నారని వారు మండిపడ్డారు.