ఆంధ్రప్రదేశ్‌కు దానా తుపాన్ ముప్పు తప్పిందని విశాఖలోని వాతావారణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిశా పూరి సమీపంలోని ధమ్రా, హబలి ఖాతి మధ్య తీరాన్ని దాటిందని తెలిపింది. తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతుందని వివరించింది. అయితే ఉత్తర ఒడిశాలోని భద్రక్ సమీపంలో తుపాన్ ప్రభావం ప్రస్తుతం కొనసాగుతుందని వివరించింది.