హైదరాబాద్‌లోని నిజాంపేట్ జయభారతీ నగర్‌లో ఎస్‌టీఎఫ్ ‘డీ’ టీమ్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించి, గురు సుమంత్ అనే వ్యక్తి నుండి 200 గ్రాముల గంజాయి, 8 కెన్నాబిస్ టాబ్లెట్లతో పాటు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి ఈ మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో గురు సుమంత్‌తో పాటు సాయి కృష్ణంరాజు అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి, వారిని కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.