విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ మంగళవారం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ ముందు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు పట్టాభిరాం మాట్లాడుతూ, ఈ గెజిట్ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ, జోన్ ఏర్పాటుతో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమైందని, ఇందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్‌కు ధన్యవాదాలు తెలిపారు.