విశాఖలో బోల్తా పడ్డ చేపల వ్యాన్

4చూసినవారు
విశాఖలో బోల్తా పడ్డ చేపల వ్యాన్
విశాఖలో జాతీయ రహదారిపై పీఎంపాలెం దరి కారుషెడ్డు కూడలి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విమానాశ్రయానికి చేపల లోడ్ తో వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ రెడ్ సిగ్నల్ పడటంతో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. రోడ్డుపై పడిన చేపలను తీసుకెళ్లేందుకు స్థానికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్