మాధవదారలో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మాధవధార, మురళి నగర్, NAD, కంచరపాలెం ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఉదయం ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినా, రోడ్లపై వాహనాలు నిలిపివేసి వాహనదారులు, పాదచారులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.