విశాఖ‌లో కుమ్మేసిన వాన‌

0చూసినవారు
విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఉరుములు, మెరుపులు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. ఆ వెంటనే నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన ఈ వర్షంతో రోడ్లన్నీ జలమయమవగా, ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అకాల వర్షం నగరంలో ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్