విశాఖపట్నంలోని అల్లిపురంలో రమాదేవి ఏర్పాటు చేసిన శరన్నవరాత్రుల బొమ్మల కొలువు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కొలువును వీక్షించారు. రకరకాల బొమ్మలు, వాటి అలంకరణ విధానం ఆకట్టుకునేలా ఉందని సందర్శకులు ప్రశంసించారు. సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన ఈ కొలువు పండుగ శోభను మరింత పెంచింది.