విశాఖపట్నంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఎన్నడూ లేనంతగా దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విశాఖవాసులు చలికి గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, అరకు, లంబసింగిలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10°C కంటే తక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ నగరంలో కూడా క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది.