విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం (6E-579) ఇంజిన్ లోపం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ బోయింగ్ 737 విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 10:54 గంటలకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరగా, విమానం సురక్షితంగా దిగింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు.