విశాఖపట్నం: గ్రంథాలయ ఉద్యమం స్ఫూర్తిదాయకం: కుమార్ రాజు

831చూసినవారు
విశాఖపట్నం: గ్రంథాలయ ఉద్యమం స్ఫూర్తిదాయకం: కుమార్ రాజు
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గ్రంథాలయ ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలకు గ్రంథాలయాలు మరింత చేరువ చేయడానికి, పాఠకుల కోరిక మేరకు పుస్తకాలు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం గ్రంథాలయాలు మెరుగైన సేవలు అందించడానికి మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్