విశాఖపట్నంలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగరంలో సంస్థ యొక్క ఇన్నోవేషన్, ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.