మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చిన మహిళలు సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పెద్ద కెరటాల్లో చిక్కుకున్న కొందరు మహిళలు కింద పడిపోయి గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి, మహిళలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.