విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్, ప్రభుత్వ సంక్షేమ శాఖ సంయుక్తంగా 'MGT 3.0' సీనియర్ సిటిజన్ల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వందలాది మంది వృద్ధులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ డైరెక్టర్ కొల్లు కవిత, ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటుందని, సర్వీస్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాజీ వీసీ డా. బాలమోహన్ దాస్ వృద్ధుల కోసం ప్రత్యేక కార్యాలయ ఆవశ్యకతను తెలిపారు. ట్రస్ట్ ప్రతినిధులు డా. పి. కె. జోస్, డా. కె. రమాప్రభ కూడా పాల్గొన్నారు.