విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 'మినీ బాలోత్సవం' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆసరా ఛారిటబుల్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ నెల ఏప్రిల్ 27న ఒక రోజు మినీ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసరా అధ్యక్షురాలు సి. సునీత తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు మూడు విభాగాలలో చిత్రలేఖనం, నృత్యం, నాటికలు, క్విజ్ వంటి పోటీలు ఉంటాయని విసిసి వ్యవస్థాపకులు డాక్టర్ కె. రమాప్రభ తెలిపారు.