విశాఖ నగరంలోని వ్యాపార సంస్థలు ఇకపై తప్పనిసరిగా బ్లూ, గ్రీన్ డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో ‘నో బిన్స్ - నో ట్రేడ్’ నిబంధన వర్తిస్తుందని జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి. నల్లనయ్య, ఎస్. ఎస్. వర్మ స్పష్టం చేశారు. శనివారం ఎండాడలో జరిగిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ కొత్త క్యాంపెయిన్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ప్రతి సంస్థా ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్’గా మారాలని, పారిశుధ్య నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అధికారులు నరేష్ కుమార్, అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.