వాష్‌రూమ్ కమోడ్‌లో కొండచిలువ కాదు.. ఉడుము! స్నేక్ క్యాచర్ చాకచక్యం

15చూసినవారు
వాష్‌రూమ్ కమోడ్‌లో కొండచిలువ కాదు.. ఉడుము! స్నేక్ క్యాచర్ చాకచక్యం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, సెక్టార్-8లోని ఒక ఇంట్లో కుటుంబం నివాసముంటోంది. ఇంట్లోంచి వస్తున్న అలికిడిని గమనించిన కుటుంబ సభ్యులు, వాష్‌రూమ్ కమోడ్‌లో కదులుతున్న జీవిని చూసి భయపడ్డారు. మొదట పాము లేదా కొండచిలువ అని భావించినా, ఆకారం తేడాగా ఉండటంతో స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్, గంటపాటు శ్రమించి కమోడ్‌లో ఉన్నది ఉడుము అని గుర్తించి, చాకచక్యంగా దాన్ని రెస్క్యూ చేశారు. దీంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

సంబంధిత పోస్ట్