విశాఖపట్నంలోని కేజీహెచ్ లో గురువారం రాత్రి 11 గంటల సమయంలో పవర్ కట్ కారణంగా దేవి అనే మహిళ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న దేవికి కరెంట్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ అందలేదని, అందుకే మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యం, విద్యుత్ కోతలే మరణానికి కారణమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇవ్వాల్సి ఉంది.