విశాఖ ఉక్కును కాపాడే బాధ్య‌త కూట‌మిదే

745చూసినవారు
మాజీ మంత్రి చింతా మోహన్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీ వరకు వేచి చూస్తామని, అప్పటిలోగా విశాఖ ఉక్కుపై కూటమి తమ వైఖరిని తెలియజేయాలని ఆయన అన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవాలని, కేంద్ర కేబినెట్ నుంచి కూటమి మంత్రులు బయటకు రావాలని సూచించారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు.

ట్యాగ్స్ :