ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. అయితే, ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA బుధవారం తెలిపింది. ఈ వర్షం వల్ల జిల్లా ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని APSDMA సూచించింది.