విశాఖపట్నం రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం ఓ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం, బస్సులో ప్రయాణికుల సంఖ్య, షార్ట్ సర్క్యూట్ కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.