
సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో దీక్షిత్ అనే 5వ తరగతి విద్యార్థి, తన కళ్లముందే కరెంట్ షాక్‌తో బాధపడుతున్న తల్లిని సమయస్ఫూర్తితో కాపాడాడు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉన్నా తల్లి రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూశాడు. అక్కడ తన తల్లి కరెంట్ షాక్‌కు గురికావడంతో భయపడకుండా.. తల్లికి తగిలి ఉన్న వైర్‌ను తొలగించి ఆమె ప్రాణాలను కాపాడాడు. అనంతరం తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, ఆమెతో కలిసి పేరెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యాడు.




