విశాఖ‌: 62వ వార్డు కార్పొరేట‌ర్‌కు గాయాలు

12చూసినవారు
విశాఖ‌: 62వ వార్డు కార్పొరేట‌ర్‌కు గాయాలు
విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గీతం భూముల వ్యవహారంపై తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం సంస్థల భూముల క్రమబద్ధీకరణ అజెండాను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగడంతో కౌన్సిల్ హాల్ యుద్ధరంగంగా మారింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో 62వ వార్డు వైకాపా కార్పొరేటర్ బళ్ళ లక్ష్మణరావు కాలికి తీవ్ర గాయమైంది. మరోవైపు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ పట్ల కూడా అధికార పక్ష సభ్యులు అమర్యాదగా ప్రవర్తించడంతో గందరగోళం పతాక స్థాయికి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్