నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా
లోకేశ్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, నాయకత్వాన్ని తీర్చిదిద్దే కేంద్రాలని పేర్కొన్నారు. యువత ప్రపంచ స్థాయి ప్రతిభతో పోటీ పడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, డిగ్రీతో పాటు విలువలు, సేవాభావమే జీవితంలో నిజమైన విజయానికి ప్రమాణాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యాసంస్థలు సామాజిక మార్పుకు దోహదపడతాయని అన్నారు.