విశాఖ: గాంధీజీకి ఘన నివాళి

1చూసినవారు
విశాఖలోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్‌లో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణ స్కూల్ అధినేత శ్రీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వాకర్స్ రెండు నిమిషాలు మౌనం పాటించి గాంధీ ఆశయాలను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వనితా వాకర్స్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్