విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శనివారం బెంగళూరు డిజైన్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో, పర్యావరణానికి హాని కలగకుండా కైలాసగిరి, జూ పార్క్, కంభాలకొండ ప్రాంతాలను అనుసంధానించి, వన్యప్రాణుల సంరక్షణతో పాటు 'నైట్ సఫారీ'ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింగపూర్ సంస్థ సహకారంతో రూపొందించిన ప్రాథమిక నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఆగస్టు నాటికి పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.