చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) తన వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన రూ. 100 స్మారక నాణేన్ని, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా
లోకేశ్,
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టం ఏయూకు అరుదైన గౌరవాన్ని తెచ్చింది.