ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రంథస్థం చేయాలని మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. మంగళవారం ఏయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘శతాబ్ది సాహితీ మహోత్సవాన్ని’ ఆయన ప్రారంభించి, వర్సిటీ ప్రగతిని వివరించేలా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. ఏయూ వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ, ఏయూ మరో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న తరుణంలో సాంకేతిక, క్రీడా, సాహిత్య వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు.