విశాఖ: మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం. విజయ సునీత ఆధ్వర్యంలో శనివారం విశాఖ రీజియన్‌లో తొమ్మిది జిల్లాల మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పి. సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కిరణ్, జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారులు, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఇతర మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
