విశాఖ: ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర నగర నిర్మాణం

6చూసినవారు
విశాఖ: ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర నగర నిర్మాణం
విశాఖ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జీవీఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బి. రాము అన్నారు. శుక్రవారం వార్డు నెం. 49లో బహిరంగ మూత్ర విసర్జన నివారణ, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా మరుగుదొడ్లు వినియోగించాలని, డ్రైనేజీల్లో ప్లాస్టిక్, చెత్త వేయకూడదని సూచించారు. పరిశుభ్రమైన డ్రైనేజీలతోనే దోమలు, దుర్వాసనలు, నీటి నిల్వల సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్