ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన విశాఖ కలెక్టర్

2చూసినవారు
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన విశాఖ కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శనివారం సాయంత్రం విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో ఉన్న ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాములను సందర్శించిన ఆయన, అక్కడి భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి వేసిన సీళ్లను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై అధికారులకు, రక్షణ సిబ్బందికి సూచనలు చేశారు. విజిటింగ్ రిజిస్టర్‌లో సంతకం చేసిన ఈ పర్యటనలో స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్