విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 32వ వార్డులో జనసేన పార్టీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు శనివారం పర్యటించారు. పలుచోట్ల జరుగుతున్న రోడ్ల మరమ్మతు పనులను సమీక్షించారు. ప్రజలు దినసరి ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేయాలని సూచించారు.