విశాఖ‌: పోక్సో కేసుల నివారణకు సమన్వయమే కీలకం

8చూసినవారు
విశాఖ‌: పోక్సో కేసుల నివారణకు సమన్వయమే కీలకం
విశాఖ జిల్లాలో పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలపై అకృత్యాలు ఎక్కువ శాతం తెలిసిన వారి ద్వారానే జరుగుతున్నాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసుల దర్యాప్తులో పోలీసు, వైద్య శాఖల పాత్ర కీలకమని, పాఠశాలల్లో చట్టంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్