ఆర్ ఆండ్ బీ జంక్షన్ వద్ద గల భూ సమేత విజయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, క్యూ లైన్లలో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలోని ఉసిరి, రావి చెట్ల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కుమార్ తెలిపారు.