విశాఖపట్నం పర్యాటక రంగానికి కొత్త కళను తీసుకొస్తూ రెండు అత్యాధునిక డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీచ్ రోడ్డులో వీటిని ప్రారంభించారు. ఒక టికెట్‌తో 24 గంటల పాటు ప్రయాణించవచ్చు. రూ. 500గా నిర్ణయించిన ధరను రూ. 250కి తగ్గించి, 14 పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించారు. ఈ వివరాలను ఆర్టీసీ అధికారులు సోమవారం తెలిపారు.