ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా, విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా తన నివాసం నుంచి డివిజనల్ కార్యాలయానికి ఈ-సైకిల్‌పై ప్రయాణించి, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాల ప్రాముఖ్యతను వివరించారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి రైల్వే ఉద్యోగులు హరిత కార్యక్రమాలను చేపట్టాలని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.