విశాఖ: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

1చూసినవారు
విశాఖ: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో, ఆనందపురం మండలం గిడిజాలలో శనివారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అల్లంసెట్టి మోహన్ రావు సమక్షంలో రైతు రాము పొలం నుండి మట్టి నమూనాలను సేకరించారు. రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం వల్ల నేల నాణ్యతలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్, హేమ సుందర్, ఏడీపీఎం శ్యామల, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్