విశాఖ‌: సీతంరాజు సుధాకర్‌కు ఫుడ్ కోర్ట్ వ్యాపారుల స‌త్కారం

0చూసినవారు
గత 32 రోజులుగా విశాఖపట్నంలో నైట్ ఫుడ్ కోర్ట్ వ్యాపారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడ్డాయి. తమ సమస్యను ఇంచార్జ్ మంత్రి దోలా బాల వీరంజనేయులు దృష్టికి తీసుకెళ్లి, అధికారుల ద్వారా మార్గదర్శనం ఇప్పించిన టీడీపీ నేత సీతంరాజు సుధాకర్‌ను వ్యాపారులు, సీఐటీయూ నాయకులు కలిసి సత్కరించారు. వ్యాపారుల కడుపు కొట్టకూడదన్నదే తన సిద్ధాంతమని ఈ సందర్భంగా సుధాకర్ పేర్కొన్నారు. తమ పోరాటానికి సహకరించిన మీడియాకు కూడా వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్