రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణంతో లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాంతో ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాస్ వినూత్న నిరసన చేపట్టారు. విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని చింతకాయల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.