విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం, సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురాడ తమ్మయ్య, బెవర పోలరాజు, మారుపల్లి అప్పన్న కుటుంబాలకు ఈ సాయం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. జేడీ ఫిషరీస్ లక్ష్మణరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.