విశాఖపట్నం జీవీఎంసీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాన కార్యాలయంలో సోమవారం వేడుకలు జరిగాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు 'విశాఖ ప్రగతి బంధు' అభినందన కార్యక్రమాన్ని నిర్వహించి, నగర అభివృద్ధికి బాధ్యతగా సకాలంలో ఆస్తిపన్ను చెల్లించిన పన్నుదారులను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం డిప్యూటీ మేయర్, కమిషనర్, ఇతర అధికారులతో కలిసి మేయర్ కేక్ కట్ చేశారు.