ప్రకృతి ఆధారంగా పండించిన ఆహారాన్ని భుజించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం మద్దిలపాలెంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రసాయన మందుల వాడకం వల్ల పర్యావరణంతో పాటు కప్పలు, పీతలు, వివిధ రకాల పక్షులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఈ భూమిపై ఉన్న జీవజాలంలో ఒక భాగమని, పర్యావరణహిత జీవనమే అందరికీ మేలు చేస్తుందని తెలిపారు.