వేసవిలో విశాఖనగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి కార్యాచరణలో భాగంగా ₹8.90 కోట్లతో 91 పనులను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1800 4250 0009 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సంబంధిత వార్డు ఇంజనీర్ల ద్వారా సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.