కూటమి ప్రభుత్వంలో
జనసేన కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, అందుకే వారు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. మంగళవారం 38వ వార్డు వైసిపి అధ్యక్షుడు గురజారపు రవి ఆధ్వర్యంలో పైన లక్ష్మణరావు, పైన జాస్మిత, మూగుడు, శ్యామ్, సవరపు ప్రకాష్‌తో సహా పలువురు
జనసేన నాయకులు వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నికల హామీలైన ‘సూపర్ సిక్స్’ను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.